ఇలా చేయకండి.. ఖాతాదారులను హెచ్చరించిన బ్యాంకులు.. ఎందుకో తెలుసా..?

24 February 2024

TV9 Telugu

ఇటీవల కాలం నుంచి యూపీఐని లక్ష్యంగా చేసుకుని బ్యాంకు ఖాతాదారులను మోసగిస్తున్నారు నేరగాళ్లు. వారి పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

మోసాలు

మీ మొబైల్ పరికరాన్ని తాజా ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ ప్యాచ్‌లతో అప్‌డేట్ చేయాలి. దీని వల్ల మీ ఫోన్‌కు భద్రత ఉంటుంది.

ఆపరేటింగ్‌ సిస్టమ్‌

అధికారిక, విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే అప్లికేషన్‌లను  ఇన్‌స్టాల్ చేయాలి. లేకుంటే మీరు మోసపోయే ప్రమాదం కూడా ఉంది.

అప్లికేషన్లు

విశ్వసనీయ ప్రొవైడర్ నుంచి యాంటీవైరస్/సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. దానిని క్రమం తప్పకుండా నవీకరిస్తూ ఉండాలి. 

సాఫ్ట్‌వేర్‌

అనుమతులను యాక్సెస్‌ చేసేముందు అప్లికేషన్‌కు సంబంధించిన ఈ-మెయిల్‌లు లేదా సందేశాలలో అనుమానాస్పద లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. 

లింకులు

ఓటీపీ, పాస్‌వర్డ్, పిన్, కార్డ్ నంబర్ వంటి మీ రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ తరహా మోసాలను వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌కు నివేదించాలని బ్యాంక్ వినియోగదారులను కోరింది.

ఓటీపీ

మిమ్మల్ని మోసం చేసేందుకు మోసగాళ్లు ప్రమాదకరమైన ఏపీకే ఫైల్‌లకు లింక్‌లను వాట్సాప్ ద్వారా పంపుతారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్‌ చేయవద్దు.

ప్రమాదకరమైన ఫైల్స్‌

ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. లేకుంటే మీ అకౌంట్‌ ఖాళీ అవుతుంది.

జాగ్రత్తలు