22 August 2024
Subhash
భారత మార్కెట్లోకి రోజురోజుకు కొత్త స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. బడ్జెట్ ధరల్లో, అద్భుతమైన ఫీచర్స్‌తో వస్తున్నాయి.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (One Plus) తన వన్ ప్లస్ ఏస్5, వన్ ప్లస్ ఏస్5 ప్రో ఫోన్లను ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా, ఇతర ఫ్లాగ్ షిప్ ఫోన్లలో వినియోగిస్తున్న క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ఎస్వోసీ ప్రాసెసర్‌ను వన్ ప్లస్ ఏస్ 5 ఫోన్.
అక్టోబర్ 21-23 మధ్య హవేలీలో నిర్వహించే స్నాప్ డ్రాగన్ సదస్సులో వన్ ప్లస్ ఏస్ 5 ప్రో ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు.
ఇదే సదస్సులో షియోమీ తన షియోమీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తుంది.
డిసెంబర్ లో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ ఏస్5, వన్ ప్లస్ ఏస్5 ప్రో ఫోన్లు రానున్నాయని చెబుతున్నారు.
వన్ ప్లస్ ఏస్ 5 ఫోన్ 1.5 కే ఎల్టీపీఓతోపాటు 6.78 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరా. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్.
100 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6200 ఎంఏహెచ్ కెమపాసిటీ డ్యుయల్ సెల్ బ్యాటరీ వస్తుందని సమాచారం.