ఈవీ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన ఓలా స్కూటర్ల ధర.. ఎంతో తెలుసా?

17 February 2024

TV9 Telugu

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు

ఈవీ వాహనాలు

 ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు భారీగా ఉన్న నేపథ్యంలో ఓ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ తన స్కూటర్‌ ధరలను తగ్గిస్తూ ప్రకటించింది

ధరలు

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన సంస్థ అయిన ఓలా.. వాహనాల కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ధరతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది

వాహనదారులకు

ఎస్‌1 స్కూటర్ల ధరలను రూ.25 వేలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తగ్గించిన ధరలు ఈ నెల చివరివరకు అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి

ధరలు తగ్గింపు

స్కూటర్లపై ఇస్తున్న 40 వేల కిలోమీటర్లు లేదా 3 ఏండ్ల వారంటీని 80 వేల కిలోమీటర్లు లేదా 8 ఏండ్లకు పెంచుతున్నట్లు కంపెనీ ఫౌండర్‌, ఎండీ భావిష్‌ అగర్వాల్‌ తెలిపారు

8 ఏళ్లకు

 ఇందుకోసం ఎలాంటి చెల్లింపులు జరుపాల్సిన అవసరం లేదని కంపెనీ ఫౌండర్‌, ఎండీ భావిష్‌ అగర్వాల్‌ తెలిపారు

చెల్లింపులు

ఎస్‌ ఎక్స్‌+ మాడల్‌ 1.09 లక్షల రూపాయల నుంచి 84,999 రూపాయలకు తగ్గనున్నట్లు కంపెనీ తెలిపింది

ధరల తగ్గింపు ఇలా

ఎస్‌1 ఎయిర్‌ కూడా రూ.1.19 లక్షల నుంచి రూ.1.05 లక్షలకు, ఎస్‌ ప్రో మాడల్‌ ధర రూ.1.30 లక్షలకు తగ్గనున్నది. అంతకుముందు ఇది రూ. 1.48 లక్షలుగా ఉంది

ఎస్‌ 1 ఎయిర్‌