9 అక్టోబర్ 2023
తాజాగా ఒకాయ కంపెనీ మోటో ఫాస్ట్ పేరిట మరో కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది. అందులో అద్భుతమైన ఫీచర్స్‌ను అందించింది
ముఖ్యంగా మైలేజ్‌తో పాటు స్పీడ్ విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ తాజా మోడల్‌ను రిలీజ్ చేసిందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఒకాయి మోటో ఫాస్ట్ గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లుగా ఉంది. ముఖ్యంగా నగర ప్రాంత ప్రజల ట్రాఫిక్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్‌ను రూపొందించారు.
ఈ స్కూటర్ గరిష్ట మైలేజ్ 120 కిలోమీటర్లు ఇస్తుంది. రోజువారీ ప్రయాణాలకు ఈ స్కూటర్ అనువుగా ఉంటుంది.
ఈ స్కూటర్ ఐదు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. సియాన్, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, బూడిద రంగుల్లో ఈ స్కూటర్ కొనుగోలుకు సిద్ధంగా ఉంటుంది
ప్రస్తుతానికి ఒకాయ మోటో ఫాస్ట్ స్కూటర్‌కు సంబంధించిన మోటర్ గరిష్ట అవుట్ పుట్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
ఈ ఒకాయ మోటో ఫాస్ట్ ఎలక్ట్రిక్ మోటర్ విషయానికి వస్తే ఈ స్కూటర్‌కు హబ్ మౌంటెడ్ యూనిట్‌గా వస్తుంది.
ఒకాయ మోటో ఫాస్ట్ 7 అంగుళాల టచ్ స్క్రీన్‌తో ద్వారా పని చేస్తుంది. ఈ స్కూటర్ వేగం, ఓడో మీటర్, రైడింగ్ మోడ్, సమయం, బ్యాటరీ శాతాన్ని ఈ స్క్రీన్‌లో మనం చూడవచ్చు.