ఉపయోగించని సిమ్‌కార్డులపై ట్రాయ్‌ జరిమానా విధించనుందా?

16 June 2024

TV9 Telugu

ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ ఫోన్‌ దర్శనమిస్తోంది. డ్యూయల్‌ సిమ్‌ ఫోన్‌లు అనివార్యంగా మారాయి. 

స్మార్ట్‌ ఫోన్‌

చాలా మంది రెండు సిమ్‌లను ఉపయోగిస్తూ వచ్చారు. మొదట్లో అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్ కాల్స్‌తో ఆపరేట్‌ చేసిన టెలికం సంస్థలు ఇప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్‌ రావాలన్నా రీఛార్జ్‌ తప్పనిసరి చేశాయి.

రెండు సిమ్‌లు

చాలా మంది ఒక సిమ్‌ కార్డులో రీఛార్జ్‌ చేస్తూ మరో సిమ్‌ కార్డును అలంకరణ ప్రాయంగా మార్చారు. 

ఒక సిమ్‌ కార్డులో

దీంతో రీఛార్జ్‌ చేయని సిమ్‌లకు ఇన్‌కమింగ్ కాల్స్‌ను నిలిపివేస్తున్నాయి టెలికం కంపెనీలు. 

రీఛార్జ్‌ చేయని సిమ్‌లకు

ఇకపై ఇలాంటి ఉపయోగంలో లేని సిమ్‌ కార్డులపై టెలికం సంస్థల నుంచి జరిమానా విధించాలని ట్రాయ్‌ భావిస్తున్న వార్తలు వచ్చాయి. 

ఉపయోగంలో లేని

అంతేకాకుండా ప్రతీ మొబైల్ నెంబర్‌కూ ఛార్జీ వసూలు చేయాలని ట్రాయ్‌ భావిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

ప్రతి మొబైల్‌కు

నంబరింగ్‌ వనరుల నియంత్రణపై వచ్చిన ప్రతిపాదనతోనే, ట్రాయ్‌ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ట్రాయ్‌

టెలికం ఆపరేటర్ల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయాలని వస్తున్నవార్తలను ట్రాయ్‌ కొట్టిపారేసింది. అలాంటిదేమి లేదని తేల్చి చెప్పింది.

టెలికం ఆపరేటర్లు