25 December 2023
సింపుల్ ఎనర్జీ తన సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం సింపుల్ డాట్ వన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ముందుగా బుక్ చేసుకున్న సింపుల్ వన్ కస్టమర్లకు ప్రత్యేకంగా రూ.99,999 (ఎక్స్-షోరూమ్ బెంగుళూరు) ప్రారంభ ధర అందుతుంది.
కొత్త కస్టమర్ల కోసం ప్రారంభ ధర జనవరి 2024లో కొంచెం ఎక్కువ ప్రీమియంతో వెల్లడి చేస్తామని కంపెనీ ప్రకటించింది.
సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి బుకింగ్‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ సింపుల్ డాట్ వన్ ఈవీకి బ్యాటరీతో మాత్రమే అమర్చబడుతుంది. ఇది 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్, ఐడీసీలో 160 కిమీలను అందిస్తుంది.
ఈ స్కూటర్ 2.77 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యంతో కంపెనీ రూపొందించింది.
ఈ స్కూటర్ 12 అంగుళాల చక్రాలు 90-90 ట్యూబ్‌లెస్ టైర్‌లతో జత చేసి రావడంతో మైలేజ్ విషయంలో వినియోగదారుడికి సౌకర్యంగా ఉంటుంది.
భద్రతా లక్షణాల్లో భాగంగా సీబీఎస్ సమర్థవంతమైన డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ముఖ్యంగా స్కూటర్ విస్తారమైన 35 లీటర్ అండర్ సీట్ స్టోరేజీని కలిగి ఉంది.