అదానీ గ్రూప్‌లో కొత్త పరిణామాలు

TV9 Telugu

04 January 2024

భారతదేశంలో అదానీ గ్రూప్ అంటే తెలియని వారుండరు. అలంటి అదానీ పోర్ట్స్ బోర్డు పునర్వ్యవస్థీకరణ జరిగింది.

తాజాగా ప్రముఖ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ CEOగా గౌతమ్ అదానీ తన తనయుడు కరణ్ అదానీని నియమించారు.

తాజాగా ప్రముఖ అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) కొత్త ఎండీగా.. కరణ్ అదానీ నియామకం జరిగింది.

అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మళ్లీ గౌతమ్ అదానీ ఉండనున్నారు.

2009లో ముంద్రా పోర్ట్‌లో అదానీ గ్రూప్‌తో తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత 2016లో CEOగా బాధ్యతలు స్వీకరించారు.

గౌతమ్ అదానీ జనవరి 4 నుంచి కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటారు. అతను మే 23, 2027 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

కరణ్ అదానీ అమెరికాలోని వెస్ట్ లఫాయెట్ లో పర్డ్యూ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు.

మరోవైపు అదానీ గ్రూప్ వ్యూహాత్మక అభివృద్ధి, రోజువారీ కార్యకలాపాలలో కూడా కరణ్ గతంలో కీలక పాత్ర పోషించారు.