26 October 2023
అమెరికన్ బహుళజాతి టెలీకమ్యూనికేషన్ దిగ్గజం మోటోరోలా సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అదే బెండింగ్ ఫోన్
తమ మాతృ సంస్థ లెనోవా ‘టెక్ వరల్డ్ 2023’లో అత్యాధునిక ప్రోటోటైప్ బెండింగ్ స్మార్ట్‌ఫోన్‌ను మోటోరోలా పరిచయం చేసింది
మడత ఫోన్లకు అప్‌డేట్ మోడల్‌గా వస్తున్న ఈ బెండింగ్ ఫోన్లను ఏకంగా చాప చుట్టినట్టు చుట్టేయవచ్చు
నిజానికి 2016 టెక్ వరల్డ్ ఈవెంట్‌లోనే దీన్ని సంస్థ పరిచయం చేసింది. అయితే ఇప్పుడీ ఫోన్‌ను మార్కెట్‌లోకి తొందర్లోనే తెచ్చేందుకు మోటోరోలా సిద్ధమవుతుంది
ఈ ఫోన్‌లో ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఫుల్ హెచ్‌డీ, పీవోఎల్‌ఈడీ డిస్‌ప్లే, 6.9 అంగుళాల స్క్రీన్.. వీలునుబట్టి 4.6 అంగుళాలకు తగ్గించుకునే సౌకర్యం
ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో ఫోన్ వెనుక వైపు డిజైనింగ్, ప్రస్తుత మోడల్స్ కంటే మెరుగైన కెమెరాలుంటాయని అంచనా, స్టోరేజీ, ర్యామ్, బ్యాటరీ సామర్థ్యాలపైనా పెరుగుతున్న ఆసక్తి
ఒకప్పుడు ఫీచర్ ఫోన్.. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్.. ఇక బెండింగ్ ఫోన్ వంతు వస్తుంది
ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ను ఎంతలా ఫోల్డ్ చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్క్రీన్‌ను డెవలప్ చేశారు