15న మార్కెట్లోకి మోటో జీ04 ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..

10 February 2024

TV9 Telugu

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ04 ఫోన్‌ను వచ్చే వారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనుంది.

దేశీయ మార్కెట్లో

మోటో జీ04 స్మార్ట్‌ ఫోన్‌ 6.6 అంగుళాల డిస్ ప్లే తో పాటు 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.

మోటో జీ04 ఫోన్

యూనిసోక్ టీ606 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్న ఈ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఉంది. ఈనెల 15న మార్కెట్లో విడుదల కానుంది.

6 జీబీ ర్యామ్‌

10వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మద్దతు

మోటో జీ04 ఫోన్ నాలుగు రంగులలో లభ్యమవుతుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ కలర్స్‌లో లభిస్తుంది.

నాలుగు రంగుల్లో లభ్యం

4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 

ఇంటర్నల్‌ స్టోరేజీ

మోటో జీ04 ఫోన్ 16-మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 22 గంటలు టాక్ టైం వస్తుంది.

కెమెరా

మోటో జీ04 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఫోన్ యూరప్ మార్కెట్లో సుమారు రూ.10,600 (110 యూరోలు) ఉంది. భారత్ మార్కెట్లో ధర ఆవిష్కరణ సందర్భంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు.

ధర