ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రులు ఎవరో తెలుసా?

26 January 2024

TV9 Telugu

ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో మధ్యంత బడ్జెట్‌ను దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు

బడ్జెట్‌

పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా అత్యధికంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన వారు ఉన్నారు

రికార్డు

ఈ బడ్జెట్‌తో చరిత్రలో 6 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో ఆర్థిక మంత్రిగా నిర్మలాసీతారామన్‌ రికార్డు సృష్టించనున్నారు

రెండో ఆర్థిక మంత్రి

ఇంతకు ముందు ఈ రికార్డు మొరార్జీ దేశాయ్‌ పేరిట ఉండేది. ఆయన అత్యధికంగా 10 సార్లు బడ్జెట్‌ను సమర్పించారు

10 సార్లు బడ్జెట్‌

ఆ తర్వాత ఎనిమిది సార్లు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లుగా రికార్డు ఉంది

8 సార్లు బడ్జెట్‌

ఇక బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు మన్మోహన్‌ సింగ్‌, అరుణ్‌జైట్లీ, యశ్వంత్‌ సిన్హాలు ఐదుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు

5 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టింది

ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా దేశంలో బడ్జెట్‌ను సమర్పించిన మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి ఉన్నారు

మొదటి ఆర్థిక మంత్రి

1964, 1968లో మొరార్జీ దేశాయ్‌ తన పుట్టిన రోజున పార్లమెంట్‌లో ఫిబ్రవరి 29న బడ్జెట్‌ను సమర్పించారు

పుట్టిన రోజు బడ్జెట్‌