యూపీఐతో త్వరలో మనీ డిపాజిట్.. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

TV9 Telugu

06 April 2024

ప్రస్తుతం అంత డిజిటల్ యుగం నడుస్తుంది. ఏమైనా కొనాలంటే అందురు యూపీఐ యాప్స్ ఉపయోగించి పేమెంట్ చేస్తున్నారు.

మనం ఫోన్‌పే ద్వారా క్షణాల్లో బంధువులకు, మిత్రులకు, వ్యాపార లావాదేవీలకు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం.

అదే యూపీఐ యాప్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో త్వరలో క్యాష్‌ డిపాజిట్ చేయొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.

ఇందుకోసం థర్డ్ పార్టీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యాప్స్‌ను ప్రీపెయిడ్ పేమెంట్ తో అనుసంధానిస్తున్నారు.

బ్యాంక్‌లపై క్యాష్ హ్యాండ్లింగ్ లోడ్ తగ్గిస్తూ క్యాష్ డిపాజిట్ మెషిన్ల ను కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటి వరకూ డెబిట్ కార్డు ద్వారా మాత్రమే క్యాష్ డిపాజిట్ చేసే సౌకర్యం ఉండేది. ఇది కూడా త్వరలో మారనుంది.

తాజాగా ఏటీఎంల వద్ద డెబిట్ కార్డు లేకుండానే కేవలం యూపీఐ ద్వారా క్యాష్‌ విత్ డ్రా చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది,

ఫోన్‌ పె, గూగుల్‌ పే యూపీఐల ద్వారా క్యాష్‌ కూడా డిపాజిట్ చేసేలా కొత్త ఫెసిలిటీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.