మరింత తగ్గిన ఎలక్ట్రిక్‌ కారు ధర.. మారుతి వ్యాగన్‌ ఆర్‌ కన్నా తక్కువకే..

05 February 2024

TV9 Telugu

ఎంజీ కామెట్‌.. గత సంవత్సరం విడుదల అయిన ఈ ఎలక్ట్రిక్‌ కారు మంచి జనాదరణ పొందింది. అద్భుతమైన ఫీచర్స్‌ ఉన్నాయి.

ఎంజీ కామెట్‌

ఈ కొత్త సంవత్సరంలో ఎంజీ మరో అడుగు వేస్తూ ఈ కారు ధరలను సవరించింది. దాదాపు రూ. లక్ష వరకూ తగ్గింపును అందిస్తోంది. 

కొత్త ఏడాదిలో

 ఇది లాంచ్‌ అప్పుడు బేస్‌ వేరియంట్‌ ధర రూ. 7.98లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ. 6.99లక్షలకే లభ్యమవుతోంది. అంటే రూ. 99,000 తగ్గింపు

బేస్‌ వేరియంట్‌

ఈ ధరలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకీ వ్యాగన్‌ ఆర్‌ ధర కంటే ఇది తక్కువకే లభ్యమవుతోంది. 

 మారుతి సుజుకీ

మారుతీ సుజుకీ వ్యాగన్‌ ఆర్‌ టాప్‌ వేరియంట్‌ 1.2ఎల్‌ జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్‌ ఏజీఎస్‌ వేరియంట్‌ ధర రూ. 7.25లక్షలు(ఎక్స్‌ షోరూం) ఉంటుంది. 

వ్యాగన్‌ ఆర్‌

ఈ వ్యాగన్‌ ఆర్‌ ప్రారంభ ధర 5.54 లక్షల రూపాయలుగా ఉంది. అత్యాధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్‌, అద్భుతమైన  ఫీచర్స్‌ ఉన్నాయి.

ధర

ఎంజీ కామెట్ 17.3కేడబ్ల్యూహెచ్‌ ప్రిస్మాటిక్ సెల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. 

ఎంజీ కామెట్

 3.3కేడబ్ల్యూహెచ్‌ చార్జర్‌ సాయంతో 7 గంటల్లో 0-100% నుంచి ఛార్జ్. కామెట్ కేవలం 4.2 మీటర్ల టర్నింగ్ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. 

ఛార్జింగ్‌