మే నెలలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

02 June 2024

TV9 Telugu

దేశంలో జీఎస్టీ వసూళ్లు (GST collection) భారీగా నమోదయ్యాయి. మే నెలకు గాను రూ.1.73 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.

దేశంలో జీఎస్టీ వసూళ్లు 

గతేడాదితో పోలిస్తే ఇది 10శాతం అధికం. మేలో దిగుమతులు 4.3 శాతం క్షీణించినా దేశీయంగా లావాదేవీలు 15.3 శాతం పెరగడంతో జీఎస్టీ వసూళ్లలో 10శాతం వృద్ధి.

 గతేడాదితో పోలిస్తే

రిఫండ్ల తర్వాత 2024 నికర జీఎస్టీ రెవెన్యూ 6.9శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లుగా నమోదైంది.  మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ.32,409 కోట్లు. ఎస్‌జీఎస్టీ రూ.40,265 కోట్లు.

నికర జీఎస్టీ 

ఐజీఎస్టీ రూ.87,781 కోట్లు, సెస్సుల రూపంలో రూ.12,284 కోట్లు. 2024-25లో మే నాటికి స్థూల జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11.3శాతం పెరిగి రూ.3.83 లక్షల కోట్లుకు.

ఐజీఎస్టీ 

అదే సమయంలో దేశీయ లావాదేవీలు 14.2శాతం పెరగ్గా, దిగుమతుల్లో 1.4శాతం పెరుగుదల కనిపించింది. 

దేశీయ లావాదేవీలు

రిఫండ్ల తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో నికర జీఎస్టీ ఆదాయం 11.6 శాతం పెరిగి రూ.3.36 లక్షల కోట్లకు చేరింది.

ఆర్థిక సంవత్సరంలో

రాష్ట్రాల వారీగా చూసినప్పుడు.. ఏపీలో గతేడాది మేలో రూ.3,373 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరగ్గా.. ఈసారి ఆ మొత్తం 15 శాతం వృద్ధితో రూ.3,890 కోట్లుగా నమోదైంది. 

రాష్ట్రాల వారీగా 

తెలంగాణలో గత సంవత్సరం చూస్తే రూ.4,507 కోట్లుగా ఉన్న వసూళ్లు 11 శాతం పెరిగి రూ.4,986 కోట్లకు చేరాయని కేంద్రం తెలిపింది.

తెలంగాణలో