మారుతి సుజుకీ బంపర్ ఆఫర్.. ఆ కారుపై ఏకంగా రూ. 49,000 డిస్కౌంట్

13 November 2023

మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ కారుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశంలో బెస్ట్ సెల్లింగ్ కారుగా ఇది నిలుస్తోంది.

వ్యాగన్‌ ఆర్‌

ఈ కారును మరింతగా వినియోగదారులకు దగ్గర చేసేందుకు మారుతి సుజుకీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 

ప్రత్యేక ఆఫర్‌

 పండుగ ఆఫర్లలో భాగంగా దీనిని తీసుకొచ్చింది. ఏకంగా రూ. 49,000 వరకూ వివిధ రకాల ప్రయోజనాలు అందిస్తోంది.

పండగ ఆఫర్‌

మన దేశంలో మారుతి సుజుకి నుంచి అక్టోబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన కారు ఈ మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్. 

 టాప్ సెల్లర్..

ఈ కారుపై మారుతి సుజుకి రూ. 25,000 నగదు తగ్గింపుతో పాటు రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది. 

తగ్గింపు

ఈ మారుతి కారుపై మొత్తం ప్రయోజనాలు కలిపి 49,000 రూపాయల వరకూ ఉంటాయి. గత కొన్ని నెలలుగా దీని కొనుగోళ్ల వృద్ధి రేటు పెరుగూతూ వస్తోంది.

రూ.49,000 వరకు ఆదా

మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ నాలుగు వేరియంట్లలో ఉంది.

నాలుగు వేరియంట్లలో..

వీటి ధరలు రూ. 5.54లక్షల నుంచి రూ. 7.42లక్షల వరకూ ఉంటుంది. దీనిలో 1 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5స్పీడ్ ఏఎంటీ టెక్నాలజీతో పాటు మాన్యువల్ ఆప్షన్లలో కూడా.

వీటి ధరలు