వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పలు వేరియంట్లపై ధరలను తగ్గించిన మారుతి

01 June 2024

TV9 Telugu

ప్రస్తుతం దేశంలో సామాన్యులు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నాడు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే రేట్లను అందించేది మారుతి సుజుకి.

మారుతి సుజుకి

 ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఏఎంటీ ట్రాన్స్ మిషన్ కార్ల ధరలు తగ్గించింది. దీంతో వాహనదారులకు ఉపశమనం కలిగించింది.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ

ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్ కార్లలో ఏఎంటీ మోడల్స్ ధరలు తగ్గిస్తున్నట్లు శనివారం తెలిపింది. 

ఏఎంటీ మోడల్స్ ధరలు

ధరలు తగ్గించడానికి కారణానికి వెల్లడించలేదు. దీంతో ఆటో గేర్ షిఫ్ట్ మోడల్ కార్ల ధరలు మరింత అందుబాటు ధరలో లభిస్తాయి. 

కార్ల ధరలు మరింత

ఏజీఎస్ మోడల్ కార్ల ధరలు రూ.5,000 తగ్గిస్తున్నట్లు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మారుతి సుజుకి వెల్లడించింది.

ఏజీఎస్ మోడల్ కార్ల ధరలు

తగ్గించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని  మారుతి సుజుకి వెల్లడించింది. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా మారుతి సుజుకి సర్వీస్ నెట్ వర్క్ 2500 నగరాల పరిధిలో అందుబాటులో ఉంటుంది.

తగ్గించిన ధరలు

హర్యానాలోని గుర్ గ్రామ్ లో సర్వీస్ సెంటర్ ప్రారంభంతో మారుతి సుజుకి సర్వీస్ సెంటర్ల సంఖ్య 5000లకు చేరుకున్నది. 

మారుతి సుజుకి సర్వీస్

గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 400 సర్వీస్ టచ్ పాయింట్లను ప్రారంభించింది. గతేడాది 2.5 కోట్ల కార్లకు సర్వీస్ అందించింది.

గత ఆర్థిక సంవత్సరంలో