12 April 2024
TV9 Telugu
దేశంలో కార్ల తయారీలో మారుతి సుజుకీ సంస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కార్లు రోజు రోజుకు అమ్మకాలు పెరుగుతున్నాయి.
ఈ మారుతి సుజుకీకి చెందిన కార్లు సామాన్యుడికి సైతం అందుబాటు ఉండేలా ధరలు ఉంటాయన్న విషయం తెలిసందే.
ప్రతి సంవత్సరం అమ్మకాలతో పోలిస్తే ఇతర కార్ల తయారీ సంస్థలకంటే మారుతి సుజుకీ కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకీ.. ప్రత్యేకంగా రెండు మాడళ్ల ధరలను పెంచింది.
తన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌తో పాటు ఎస్‌యూవీ గ్రాండ్ విటారా మాడళ్ల ధరలను 25 వేల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
వీటిలో స్విఫ్ట్ ధరను రూ.25 వేలు పెంచిన సంస్థ.. గ్రాండ్ విటారా మాడల్‌ను 19 వేల రూపాయలు అధికం చేసినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.
మారుతి సుజుకీకి చెందిన స్విఫ్ట్ మాడల్ ధర 5.99 లక్షల రూపాయల నుంచి 8.89 లక్షల రూపాయల వరకు చేరుకుంది.
సిగ్మా రకం గ్రాండ్ విటారా మాడల్ 10.8 లక్షల రూపాయల వరకు చేరుకుంది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.