17 January 2024
TV9 Telugu
కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న సంస్థ మారుతి సుజుకీ పలు మోడళ్లపు ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది
పలు మోడళ్లపై పెరిగిన ఛార్జీలు జనవరి 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు మారుతీ సుజుకీ తెలిపింది
అన్ని మాడళ్ల ధరలను 0.45 శాతం పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. ఆయా మోడళ్లను బట్టి ధరలు పెరుగుదల ఉంది
ప్రస్తుతం సంస్థ రూ.3.54 లక్షలు మొదలుకొని రూ.28.42 లక్షల లోపు ధర కలిగిన పలు మోడళ్లను దేశీయంగా విక్రయిస్తోంది
ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంభదించినవి. మరోవైపు, వోల్వో కార్ ఇండియా కూడా పలు మాడళ్ల ధరలను పెంచింది.
ఇంటర్నల్ కంబూస్టిన్ ఇంజిన్(ఐసీజీ) ఇంజిన్ కలిగిన వాహన ధరలను 2 శాతం సవరించినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది
దీంతో ఎక్స్‌సీ60 మాడల్ ధర రూ.68.9 లక్షలకు, ఎస్90 ధర రూ.68.25 లక్షలు, ఎక్స్‌సీ90 ధర రూ.1,00,89,000కి చేరుకున్నాయి
వాహనాల తయారీలో ఉపయోగించే ముడి సరుకు ఛార్జీలు పెరగడం కారణంగానే తాము ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది