రూ.15 వేల వరకు ఎక్కువ ఫీచర్స్ ఉండే 5G ఫోన్స్ ఇవే..!

20 September 2023

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్కెట్‌లో 5G ఫోన్ల హవా కొనసాగుతోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు తెగ ప్రయత్నిస్తున్నాయి.

భారత్‌ దేశంలో ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో 5జీ ఫోన్ల వాటా 45 శాతం కలిగి ఉన్నట్లు సీఎంఆర్ అద్యయనంలో వెల్లడైంది.

వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కువ బడ్జెట్‌లోనే 5G ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నాయి.

లాంచింగ్ సమయంలో 5G ఫోన్ల ధర కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ క్రమేనా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రూ.15 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న ఫోన్లు ఏవో చూద్దాం.

Realme 11x 5G:  ఫుల్ హెచ్డి డిస్ ప్లే తో పాటు 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా తో మార్కెట్‌లోకి వచ్చింది. 6GB RAM+ 128GB స్టోరేజ్ దీని కెపాసిటీ. ఫోన్ ధర రూ.14999.

Motorola G62 5G: ఫుల్ హెచ్డి డిస్ ప్లే తో పాటు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ ఫ్రెంట్ కెమెరా. బ్యాటరీ బ్యాకప్ 5000mAh. 8GB RAM+ 128GB స్టోరేజ్ దీని కెపాసిటీ. దీని ధర రూ.14999. 

Motorola G62 5G: ఫుల్ హెచ్డి డిస్ ప్లే తో అందుబాటులోకి వచ్చింది. 6GB RAM+ 128GB స్టోరేజ్ వెర్షన్ స్మార్ట్ ఫోన్ ధర రూ.13999 గా ఉంది.

Vivo T2x 5G: ఫుల్ హెచ్డి డిస్ ప్లేతో పాటు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను చేర్చారు. 6GB RAM+ 128GB స్టోరేజ్ సామర్ధ్యం. ఫోన్ ధర రూ.13999. 

రెడ్ మీ 12 5G స్మార్ట్ ఫోన్ ల్ హెచ్డి డిస్ ప్లేతో పాటు 6GB RAM వెర్షన్ ధర రూ.11,999 గా ఉంది. 

పోకో ఎమ్ 6 5G స్మార్ట్ ఫోన్ ల్ హెచ్డి డిస్ ప్లేతో పాటు 6GB RAM వెర్షన్ ధర రూ.10999 గా ఉంది.