ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్‌ను అధిగమించి అగ్రస్థానానికి..
January 29, 2024
TV9 Telugu
ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ తాజాగా ప్రపంచంలో అత్యంత సంపన్నుల నివేదిక విడుదల చేసింది. ఇందులో టాప్ 10 సంపన్నుల పేర్లను వెల్లడించింది
అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్ ఛైర్మన్, సీఈఓ బెర్నార్డ్ అర్నాల్ట్ 207.8 బిలియన్ డాలర్ల నికర ఆదాయంతో ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు
దీంతో ఆయన టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌ను అధిగమించి అగ్రస్థానానికి ఎగబాకారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన రియల్-టైమ్ బిలియనీర్స్ జాబితాలో ఈ మేరకు పేర్కొంది
అర్నాల్ట్, ఆయన కుటుంబం నికర ఆస్తుల విలువ గత శుక్రవారం 23.6 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో వారి ఆస్తి విలువ మొత్తం 207.8 బిలియన్ డాలర్లకు చేరింది
ఇక టెస్లా సీఈఓ ఎలన్‌మస్క్ నికర విలువ 204.7 బిలియ్ డాలర్లుగా ఉంది. దీంతో ఆయన రెండో స్థానంలో నిలిచారు
అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ 181.3 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడో స్థానంలో నిలిచారు. 142.2 బిలియన్ డాలర్ల నికర విలువతో ల్యారీ ఎల్లిసన్ నాలుగో స్థానంలో నిలిచారు
ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ - 139.1 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో, వారెన్ బఫెట్ – 127.2 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉన్నారు
భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 104.4 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ 75.7 బిలియన్ డాలర్ల నికర విలువతో 16 స్థానంలో ఉన్నారు