పాన్ కార్డు పోయిందా..? క్షణంలో కొత్త కార్డు పొందండి

13 November 2023

ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) చాలా కీలకం. నల్లధనాన్ని అరికట్టడం నుంచి అక్రమ లావాదేవీల వరకు పాన్‌ను ట్రేస్ చేసి ప్రభుత్వం బట్టబయలు చేస్తుంది

బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఆస్తి కొనుగోలు చేసినా ఇప్పుడు పాన్ కార్డ్ తప్పనిసరై పోయింది. ఐతే పాన్‌ కార్డును పొరపాటున పోగొట్టుకుంటే ఎలా..?

ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. పాన్‌ కార్డు పోగొట్టుకున్నవారు తిరిగి ఒకరిజినల్ డాక్యుమెంట్‌కు బదులుగా ఇ-పాన్ తీసుకోవచ్చు 

అదెలాగంటే.. ప్రభుత్వ ఆఫీస్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్‌లైన్ మోడ్‌లో కేవలం 10 నిమిషాల్లో దీన్ని డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు

తక్షణమే పాన్ కార్డు అందుకునేలా ఇ-పాన్‌ సర్వీస్‌ను ప్రారంభించింది. ఆధార్‌తో లింక్ అయిన ఇ-కేవైసీ వెరిఫికేషన్ ద్వారా వినియోగదారులు వివరాలను ధ్రువీకరించిన తర్వాత ఇ-పాన్ కార్డులు జారీ చేస్తారు

ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా జారీ అయ్యే ఇ-పాన్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎలాంటి రుసుము చెల్లించకుండానే ఉచితంగా అందుకోవచ్చు

ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలు. అయితే ఆధార్‌కు పాన్‌ కార్డును పాన్‌తో తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలి. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కూడా ఉండాలి

ఎలాంటి ఇబ్బందులే లేకుండా సింపుల్‌గా ఇ-పాన్‌ను జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని ఒరిజినల్ పాన్ కార్డు మాదిరిగానే ఉపయోగించుకోవచ్చు