నోకాస్ట్ EMI లాభం కంటే నష్టమే ఎక్కువ.. ఎలా అంటే.. 

18 October 2023

పండుగ సీజన్ వచ్చేసింది.  మీరు టీవీ, ఫ్రిజ్ లేదా మరేదైనా వస్తువును నో కాస్ట్ EMI ఫెసిలిటీతో తీసుకోవాలని అనుకుంటున్నారా?  ఇది సాధారణ EMI కి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. 

కస్టమర్లను ఆకర్షించడమే ఈ ఆప్షన్ ఉద్దేశం. ఈ విధానంలో  ఖరీదైన వస్తువులను వాయిదాల పద్ధతిలో సులభంగా కొనుగోలు చేయవచ్చు. 

నో కాస్ట్ EMI ఆఫర్‌లో కస్టమర్ నుంచి ఎటువంటి వడ్డీ వసూలు చేయరు. ఇలా వడ్డీ లేకుండా లోన్ ఇవ్వడం వలన  బ్యాంకులు లేదా NBFCలకు ప్రయోజనం ఏమిటి? 

నిజానికి ఈ సదుపాయం బ్యాంకులకు, రిటైల్  వ్యాపారులకు లాభదాయకం... వినియోగదారులకు మాత్రం నష్టమే అని చెప్పాలి. 

ఇందులో  కస్టమర్‌కు ప్రయోజనం ఏమిటంటే, వారు ఒకేసారి ఎక్కువ డబ్బు పెట్టనవసరం లేకుండా ఖరీదైన వస్తువులను వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు. 

బ్యాంక్ లేదా NBFCకి ప్రయోజనం ఏమిటంటే, వారి బిజినెస్ డెవలప్ అవుతుంది. వారికి వారు ప్రతి నెలా స్థిరమైన ఇన్ కామ్ వస్తుంది. చిల్లర వ్యాపారులకు ప్రయోజనం ఏమిటంటే వారి అమ్మకాలు పెరగడం. 

నో-కాస్ట్ EMI విషయానికి వస్తే, మీరు ఒక ప్రోడక్ట్ కి  ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ని ఉపయోగించి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా పూర్తి పేమెంట్ చేస్తే.. మీకు దానిపై భారీగా డిస్కౌంట్ వస్తుంది. 

అదే నో కాస్ట్  EMIలో, మీరు ఆ తగ్గింపు నుంచి  ప్రయోజనం పొందలేరు.  దీనిలో, రిటైలర్ మీ నుంచి ప్రోడక్ట్  పూర్తి ధరను తీసుకుంటారు. ఆ ధర ఆధారంగా మీ EMI సిద్ధం చేస్తారు.