22 September
Subhash
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..వ్యాగన్‌ఆర్ వాల్ట్ ఎడిషన్‌గా విడుదల చేసింది.
ఈ కారు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ధరల్లో కంపెనీ డిజైన్ చేసింది. మార్కెట్లో ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది.
ఎల్‌ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్ రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.5,65,671 (ఢిల్లీ-ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది.
లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ మాడల్‌ను నూతన టెక్నాలజీతో ఆధునీకరించినట్లు కంపెనీ వెల్లడించింది.
ముఖ్యంగా లోపలిభాగంలో పలు మార్పులు చేసి మార్కెట్లో విడుదల చేసినట్లు మారుతి సుజుకీ కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఫాగ్ ల్యాంప్స్‌తో పాటు వీల్ ఆర్చ్ క్లాడింగ్స్, బంపర్ గార్డ్స్, బాడీ సైడ్ మౌల్డింగ్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ మారుతి సుజుకీ వ్యాగన్‌ఆర్ వాల్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్పీకర్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉన్నాయి.
దేశీయ రోడ్లపై 32.5 లక్షల వ్యాగన్ ఆర్ కార్లు దూసుకుపోతున్నాయి. పెట్రోల్‌తోపాటు సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా లభించనుంది.