15 September 2023

లైఫ్.. హెల్త్ రెండు బెనిఫిట్స్ ఒకే పాలసీలో

ఇప్పటి వరకూ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం వేరుగా.. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం  వేరుగా పాలసీలు తీసుకోవాల్సి వచెది. 

ఈ రెండూ కలిసి ఒకే పాలసీలా వస్తే ఎంత బావుంటుంది అనుకునే వారికి ఓ గుడ్ న్యూస్ ఉంది 

జీవిత, ఆరోగ్య బీమా పాలసీలను ఒకే చోట అందించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఒక పాలసీ తీసుకువచ్చాయి. 

ఈ వినూత్న పాలసీని ‘ఐషీల్డ్‌’ పేరుతో అందిస్తున్నాయి. 

ఈ పాలసీ  వైద్య చికిత్సలకు అవసరమైన ఖర్చులను చెల్లించడంతోపాటు, పాలసీదారుడు మరణించిన సందర్భంలో ఈ పాలసీ పరిహారాన్ని చెల్లిస్తుంది. 

ఆరోగ్య బీమా పాలసీలో రోజువారీ చికిత్సలు, ఆసుపత్రిలో చేరక ముందు, ఇంటికి వచ్చాక చికిత్సలాంటివి చెల్లిస్తుంది. 

జీవిత బీమా రక్షణ 85 ఏళ్ల వరకూ కొనసాగుతుంది. 

ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించేలా ఈ పాలసీని రూపొందించినట్లు బీమా సంస్థలు తెలియజేస్తున్నాయి.

రెండు వేర్వేరు పాలసీలను తీసుకోవాల్సిన అవసరాన్ని ఐషీల్డ్‌ తప్పిస్తుందని పేర్కొంటున్నాయి.  ఒకే అప్లికేషన్  పూర్తి చేసి, అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకొని, ఈ పాలసీని కొనుగోలు చేయొచ్చు. 

ఇన్సూరెన్స్ కంపెనీల  ఏజెంట్లు, కంపెనీ వెబ్‌సైట్‌, యాప్‌ నుంచి ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంది.