07 April 2024
TV9 Telugu
రూ.3,600 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.27 లక్షలు.. ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన ప్లాన్ ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ సురక్షిత పథకం.
ఇది కుమార్తెల కోసం ప్రారంభించింది కేంద్రం. మీరు మీ కుమార్తె చదువు లేదా వివాహ ఖర్చుల కోసం ఈ పాలసీని ప్రారంభించవచ్చు.
ఈ పాలసీలో మీరు ప్రతిరోజూ రూ. 121 డిపాజిట్ చేయాలి అంటే మీరు ప్రతి నెలా రూ. 3,600 పెట్టుబడి పెట్టాలి.
మీరు ఈ మొత్తాన్ని 25 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాలి. అలాగే మెచ్యూరిటీకి మీరు 27 లక్షల రూపాయల వరకు పొందవచ్చు.
ఎల్‌ఐసీ పాలసీలో వివిధ మెచ్యూరిటీ పీరియడ్‌ల ఎంపిక ఉన్నాయి. మీరు 25 ఏళ్లపాటు ఇందులో ఇన్వెస్ట్ చేయకూడదనుకుంటే, కనీసం 13 ఏళ్ల మెచ్యూరిటీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
మీరు రోజూ రూ. 121 డిపాజిట్ చేయకూడదనుకుంటే, మీరు 25 సంవత్సరాల పాటు రోజువారీ రూ. 75 లేదా నెలకు రూ. 2,250 పెట్టుబడి పెట్టవచ్చు. ఆ తర్వాత మెచ్యూరిటీపై రూ. 14 లక్షలు.
ఈ పాలసీ ప్రకారం, పెట్టుబడి మొత్తాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఇది మెచ్యూరిటీలో మీరు స్వీకరించే నిధులపై ప్రభావం చూపుతుంది.
ఎల్‌ఐసీ ప్లాన్‌లో కుమార్తె వయస్సు కనీసం 1 సంవత్సరం ఉండాలి. కన్యాదాన్ పాలసీలో పెట్టుబడిదారులు పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.