ప్రపంచంలో 50 అతిపెద్ద బీమా కంపెనీల జాబితాలో 4వ స్థానంలో LIC

12 December 2023

భారత దేశానికి చెందిన అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. LIC ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద బీమా సంస్థగా నిలిచింది.

తాజాగా 2022 ఏడాదికి గానూ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ సంస్థ టాప్ 50 బీమా సంస్థల ర్యాంకింగ్‌లను విడుదల చేసింది.

జర్మనీకి చెందిన అలియాంజ్‌ ఎస్‌ఈకి మొదటి స్థానంలో , చైనాకు చెందిన చైనా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రెండో స్థానంలో ఉంది.

మూడో స్థానంలో జపాన్‌కి చెందిన నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూడో స్థానంలో ఉండగా.. మన దేశానికి చెందిన LIC నాల్గో స్థానంలో ఉంది.

టాప్ 50 గ్లోబల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల S&P జాబితాలో అత్యధికంగా 21 యూరోపియన్ కంపెనీలుండగా.. ఆసియాకు చెందిన సంస్థలు 17 ఉన్నాయి.

S&P గ్లోబల్ నివేదిక ప్రకారం గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎల్ఐసీ ఆస్తుల విలువ సుమారు రూ.42 లక్షల కోట్లు.

అలియాంజ్ ఇన్సూరెన్స్ సంస్థల ఆస్తుల విలువ సుమారు రూ.87లక్షల కోట్లు ఉన్నట్లుగా S&P గ్లోబల్ నివేదిక తెలిపింది.

చైనాకి చెందిన చైనా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆస్తుల విలువ సుమారు రూ.52 లక్షల కోట్లు అని నివేదిక ద్వారా తెలిసింది.