పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? KYC రూల్స్ మారాయి.. తెలుసుకోండి

25 October 2023

మీరూ పోస్టాఫీసు స్కీమ్‌లలో పొడుపు చేస్తున్నారా? అయితే, ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లోని ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే.

ఇటీవల భారత పోస్టల్‌ విభాగం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో రూ.10 లక్షలు ఆపై ఇన్వెస్ట్ చేసే వారి నుంచి కేవైసీ పత్రాలతో పాటు ఆదాయ ధ్రువీకరణ డాక్యుమెంట్లు తప్పనిసరి చేసింది

తక్కువ రిస్క్‌: అన్ని సేవింగ్స్‌ పథకాల్లో ఉన్న డిపాజిట్ల మొత్తం రూ.50,000 దాటిన కస్టమర్లను తక్కువ రిస్క్‌ ఉన్నవారి కింద వర్గీకరించారు.

మీడియం రిస్క్‌: పైన తెలిపిన మొత్తం రూ.50,000 మించి రూ.10 లక్షల లోపు ఉంటే అలాంటి కస్టమర్లను మీడియం రిస్క్‌ కింద వర్గీకరించారు.

హై రిస్క్‌: ఒకవేళ పైన తెలిపిన మొత్తం రూ.10 లక్షలు దాటితే వారిని హై రిస్క్‌ కేటగిరీలో చేర్చారు. రాజకీయాలతో సంబంధం ఉండి భారత్‌ వెలుపల నివసిస్తున్న కస్టమర్ల ఖాతాలను కూడా ఈ కేటగిరీ కిందే వర్గీకరించారు.

పైన పేర్కొన్న మూడు కేటగిరీల వారు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోగ్రాఫ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. జాయింట్‌ ఖాతా అయితే, అందరూ ఇవ్వాలి.

చిరునామా ధ్రువీకరణ కోసం ఆధార్‌ లేదా పాన్‌ లేదా చిరునామా ఉన్న పాస్ట్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ గుర్తింపు కార్డు, యుటిలిటీ బిల్స్‌ వంటి వాటిని ఇవ్వొచ్చు.

అన్ని డాక్యుమెంట్లను ఇన్వెస్టర్స్ సెల్ఫ్‌ అటెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు హైరిస్క్‌ కేటగిరీలో ఉన్న కస్టమర్లు ఇన్వెస్ట్మెంట్ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో రుజువు చేసే పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది.

దీని కోసం బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌ ఖాతా స్టేట్‌మెంట్‌, ఐటీ రిటర్నులు, సేల్‌ డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌, వీలునామా, సక్సెషన్‌ సర్టిఫికెట్‌.. వీటిలో ఏవైనా ఇవ్వొచ్చు.