4,358 సెల్టోస్ కార్లను రీకాల్ చేస్తున్న కియా మోటార్స్.. కారణం ఏంటంటే!

23 February 2024

TV9 Telugu

దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా తన సెల్టోస్ ఎస్‌యూవీ కార్లు 4,358 యూనిట్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

రీకాల్‌

సెల్టోస్ ఎస్‌యూవీ కార్లు సీవీటీ వర్షన్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. 

సీవీటీ వర్షన్ కార్లు

సీవీటీ వర్షన్ ‘ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్‌లో ఎర్రర్’ ఉన్నట్లు గుర్తించించిన కంపెనీ దీనిని మార్చేందుకు రీకాల్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

ఆయిల్ పంప్

గత సంవత్సరం ఫిబ్రవరి 28 నుంచి జూలై 13 మధ్య కాలంలో తయారైన సీవీటీ వర్షన్ కార్లను రీకాల్ చేస్తున్నామని వివరించింది. 

గత ఏడాది

ఈ సెల్టోస్ ఎస్‌యూవీ కార్లు సీవీటీ వర్షన్ స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నామని, ఉచితంగా ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్’ రీప్లేస్ చేస్తామని తెలిపింది.

ఆయిల్‌ పంపింగ్‌

15 హై-సేఫ్టీ ఫీచర్లు, 17 మోస్ట్ ఎవాల్వ్‌డ్ లెవెల్ 2-అడాస్ అటానమస్ ఫీచర్లతో పాటు 32 సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. డ్యుయల్ స్క్రీన్ పనోరమిక్ డిస్ ప్లే విత్ 26.04 సీఎం ఫుల్ డిజిటల్ క్లస్టర్.

ఫీచర్స్‌

26.03 సీఎం హెచ్డీ టచ్ స్క్రీన్ నేవిగేషన్, డ్యుయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్, ఆర్17 43.66 క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

టచ్‌ స్క్రీన్‌

 సెల్టోస్ ఎస్‌యూవీ కారులో డ్యుయల్ పేన్ పనోరమిక్ సన్ రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్లు జత కలిశాయి.

బ్రేక్‌ ఫీచర్స్‌