సమయం దగ్గర పడుతోంది.. వెంటనే ఈ పని చేసుకోండి.. లేకుంటే ఛార్జీల వడ్డన

06 June 2024

TV9 Telugu

ఆధార్ కార్డ్‌లో ఉచిత అప్‌డేట్ చేయడానికి గడువు దగ్గర పడుతోంది. యూఐడీఏఐ ఆధార్ కార్డ్‌లో ఉచిత అప్‌డేట్‌ తేదీని 14 మార్చి నుండి 14 జూన్ 2024 వరకు పొడిగించింది. 

ఆధార్ కార్డ్‌

myAadhaar పోర్టల్‌లో ఉచిత అప్‌డేషన్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ప్రజలు తమ ఆధార్ పత్రాలను అప్‌డేట్ చేయాలంది UIDAI.

myAadhaar

ఆన్‌లైన్ అప్‌డేట్‌లో మాత్రమే ఉచిత ఆధార్ అప్‌డేట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.  మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఛార్జీలు చెల్లించాలి.

ఆన్‌లైన్ అప్‌డేట్‌

బ్యాంకు ఖాతాకు, ప్రభుత్వ పథకాలకు, సిమ్ కార్డు కొనడం, ఇల్లు కొనడం వంటి డబ్బు సంబంధిత కార్యకలాపాలన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయింది. 

ఆధార్

ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయకపోతే చాలా రకాల  పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. అందుకే అప్‌డేట్‌ చేయడం మంచిది.

అప్‌డేట్ చేయకపోతే 

మీరు ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా లేదా స్వయంగా ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. 

ఆధార్ కేంద్రాన్ని

ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి, కస్టమర్‌లు వారి జనాభా డేటా, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని అందించాలి. 

ఆధార్ కార్డు

ఆధార్‌లో వివరాలు అప్‌డేట్‌ కోసం మీరు ఆధార్ కేంద్రానికి మాత్రమే వెళ్లాలి. ఐరిస్ లేదా బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడానికి, ఎవరైనా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.

వివరాలు