బంగారం కంటే వెండి ధర ఎక్కువ కాబోతుందా..?

22 September 2024

TV9 Telugu 

భారతదేశంలో ఇత్తడి, వెండి, అల్యూమినియం వంటి లోహాలలో ఉపయోగించే జింక్ లోహం వినియోగం వేగంగా పెరుగుతుంది.

వచ్చే 10 ఏళ్లలో భారత్‌లో జింక్ వినియోగం వేగంగా పెరుగుతుందని అంతర్జాతీయ జింక్ యూనియన్ (IZA) తెలిపింది.

ప్రస్తుత ఉత్పత్తి 11 లక్షల టన్నుల నుంచి 20 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

భారత్‌లో జింక్ వినియోగం, డిమాండ్ 11 లక్షల టన్నులు అని IZA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రూ గ్రీన్ తెలిపారు.

భారతదేశంలో ప్రస్తుత ఉత్పత్తి కంటే ఎక్కువ. వచ్చే పదేళ్లలో ఇది 20 లక్షల టన్నులకు చేరుకునే అవకాశం ఉంది.

విశేషమేమిటంటే వెండి వినియోగం బంగారం కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉందని వాణిజ్య నిపుణల నివేదికలు చెబుతున్నాయి.

భారతదేశంలో ప్రతి సంవత్సరం 700 టన్నులకు పైగా బంగారం వినియోగం జరుగుతోందని అంటున్నారు వాణిజ్య నిపుణులు.

ఈ వేగంతో డిమాండ్ పెరిగితే, ధరలు కూడా ప్రభావితమవుతాయి. ఇలా జరిగితే వెండి ఖరీదు అవుతుందని నిపుణుల అంచనా.