దేశవ్యాప్తంగా మార్కెట్‌లో చిన్న నోట్లకు అంటే రూ.10, 20, 50 నోట్ల కొరతపై పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో చిన్న నోట్లు తక్కువగా దొరుకుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఆర్బిఐ చిన్న నోట్ల ముద్రణను నిలిపివేసిందని, మార్కెట్‌లో వీటి కొరత చాలా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఠాగూర్ రాసిన లేఖలో పేర్కొన్నారు.
నోట్ల కొరత కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాణికం ఠాగూర్ పేర్కొన్నారు.
చిన్న నోట్ల కొరతను అధిగమించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిని డిమాండ్ చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ. 500 విలువ కలిగిన నోటు వాటా మార్చి 2024 నాటికి 86.5గా ఉంది.
మార్చి 31, 2024 నాటికి, గరిష్టంగా రూ.500 నోట్లు 5.16 లక్షలు ఉండగా, రూ.10 నోట్లు 2.49 లక్షలతో రెండో స్థానంలో నిలిచాయి.
చిన్న నోట్ల కొరతపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2023-24 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ రూ.5,101 కోట్లు ఖర్చు చేసింది.