PPFలో ఇన్వెస్ట్ చేశారా? ఇందులో వచ్చే ఈ బెనిఫిట్ తెలిస్తే ఎగిరిగంతేస్తారు

05 October 2023

మన సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వెనక్కి తీసుకోవడం చేస్తుంటాం. PPFలో చేసిన ఇన్వెస్ట్ చేస్తే డబ్బు మధ్యలో తీసుకోవచ్చా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - PPF అంటే ఏమిటి అనే విషయం చూద్దాం. మంచి వడ్డీ - టాక్స్ బెనిఫిట్స్ తో వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ PPF

ఈ ప్లాన్‌లోని గొప్పదనం ఏమిటంటే ఇందులో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది అలాగే దీనిలో లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

మీరు PPF ఖాతాలో డిపాజిట్‌పై కూడా లోన్ తీసుకోవచ్చు. మీరు PPF ఎకౌంట్ ను తెరిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఒక ఆర్థిక సంవత్సరం నుంచి ఐదవ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు లోన్ తీసుకోవచ్చు

మీ డిపాజిట్ పై గరిష్టంగా 25% వరకు లోన్ తీసుకోవచ్చు. మీరు తీసుకునే లోన్ పై వడ్డీ రేటు మీకు ఈ ఎకౌంట్ పై వచ్చే వడ్డీ రేటు కంటే కేవలం 1 శాతం మాత్రమే ఎక్కువ ఉంటుంది.

అత్యవసర పరిస్థితిలో లోన్ కోసం వేరే ప్రయత్నాలు చేయడం కంటే.. మన ఇన్వెస్ట్మెంట్ నుంచి కొంత మొత్తం లోన్ తీసుకోవడం ద్వారా తక్కువ వడ్డీకి లోన్ పొందే అవకాశం ఇస్తుంది PPF.

తిరిగి మన డబ్బు చెల్లించిన తరువాత PPF ఎకౌంట్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ యధాతథంగా ఉంటాయి.

PPF మనకు ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే, త్రైమాసిక పద్ధతిలో వడ్డీని లెక్కిస్తారు. అలాగే దీనిలో వడ్డీపై వడ్డీని పొందే అవకాశమూ ఉంది