22 January 2024
TV9 Telugu
ఫిబ్రవరి 1వ తేదీని పార్లమెంట్‌లో మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రకటన కోసం పన్నుచెల్లింపుదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం పాత పన్ను విధానంలో రూ.2,50,000 వరకు ఆదాయంపై పన్ను రేటు జీరో. రూ. 2,50,001 నుంచి రూ. 5,00,000 వరకు ఉన్న ఆదాయంపై పన్ను రేటు ఐదు శాతం.
రూ. 5,00,001 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయంపై ఇది 20 శాతం, రూ. 10,00,001 ఆపైన ఆదాయంపై పన్ను రేటు 30 శాతం.
కొత్త విధానంలో రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను రేటు జీరో పర్సంటే. రూ. 3,00,001 నుంచి రూ. 6,00,000 వరకు ఆదాయంపై ఐదు శాతం.
రూ. 6,00,001 నుంచి రూ. 9,00,000 వరకు ఉన్న ఆదాయంపై 10 శాతం, రూ. 9,00,001 నుంచి రూ. 12,00,000 వరకు ఆదాయంపై 15 శాతం.
రూ. 12,00,001 నుండి రూ.15,00,000 ఆదాయంపై పన్ను రేటు 20 శాతం, ఇక రూ. 15,00,000 కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం ఉంది.
రెండు పన్ను వ్యవస్థలలో పన్ను మినహాయింపు ఇచ్చారు. కొత్త పన్ను చెల్లింపుదారుల వ్యవస్థలో రూ. 7 లక్షల వరకు ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు పన్ను చట్టంలోని సెక్షన్ 87A కింద మినహాయింపు.
పాత విధానంలో రూ. 5 లక్షలు చెల్లించే పన్ను చెల్లింపుదారులకు మినహాయింపు పరిమితి. ఈ బడ్జెట్‌లో ఎలాంటి మినహాయింపులు ఉంటాయన్నది ఆసక్తినెలకొంది.