23 October 2023

బాగా పెరిగిన FDల పై వడ్డీ రేట్లు..  ఎక్కడ ఎంత అంటే..?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపోరేట్లు పెంచినప్పటి నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (FD) అందించే వడ్డీ రేట్లు బాగా పెరిగాయి. 

దీంతో బజాజ్‌ ఫైనాన్స్‌ , ముత్తూట్ క్యాపిటల్‌ సర్వీసెస్‌తో పాటూ మరో మూడు NBFCలు  వడ్డీ రేట్లను ఆకర్షణీయంగా పెంచాయి.

ఐదేళ్ల కాల వ్యవధితో అందించే ఎఫ్‌డీలకైతే 8 శాతం కంటే ఎక్కువ వడ్డీలను అందిస్తున్నాయి.

ముత్తూట్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌: ఏడాది వ్యవధితో  అందించే ఎఫ్‌డీలకు 7.21 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక మూడేళ్ల పాటు ఎఫ్‌డీలపై 8.07 శాతం, ఐదేళ్ల పాటు అయితే 8.38 శాతం అత్యధిక వడ్డీని అందిస్తోంది.

శ్రీరామ్‌ ఫైనాన్స్‌: ఏడాది కాలవ్యవధితో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7.34 శాతం, మూడేళ్ల పాటూ అయితే 7.95 శాతం, ఐదేళ్ల పాటు అయితే ఏకంగా 8.18 శాతం వడ్డీని ఇస్తోంది.

బజాజ్‌ ఫైనాన్స్‌: ఆర్థిక సంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా ఎఫ్‌డీలపై అధిక వడ్డీని అందిస్తోంది. సంవత్సరం పాటూ చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7.40 శాతం, మూడేళ్ల పాటూ అయితే 8.05 శాతం, ఐదేళ్ల పాటు అయితే 8.05 శాతం వడ్డీని ఇస్తోంది.

మహీంద్రా ఫైనాన్స్‌: సంవత్సరం కాలంతో చేసే ఎఫ్‌డీలకు 7.60 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక మూడేళ్ల పాటు చేసే ఎఫ్‌డీలపై 8.05 శాతం, ఐదేళ్ల పాటు అయితే 8.05 శాతం వడ్డీని అందిస్తోంది.

సుందరం హోమ్‌ ఫైనాన్స్‌: సంవత్సరం పాటూ చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 7.45 శాతం, మూడేళ్ల పాటూ అయితే 7.75 శాతం, ఐదేళ్ల పాటు కాల వ్యవధితో అయితే 7.90 శాతం అత్యధిక వడ్డీని ఇస్తోంది.

వీటితో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా FDల పై ఆకర్షనీయమైన వడ్డీలను అందిస్తున్నాయి. 

FDలో పొదుపు చేయాలి అనుకున్నపుడు.. అన్ని చోట్ల వడ్డీరేట్లను తెలుసుకుని అనుకూలమైన చోట ఇన్వెస్ట్ చేయడం మంచిది.