10 January 2024
TV9 Telugu
ఇండిగో విమానాల్లో ముందు వరుస సీట్లు కావాలంటే ప్రయాణికులు రూ.2,000 వరకు అదనంగా చెల్లించుకోవాల్సిందే
ఈ మేరకు సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లో ఆయా సేవలకుగాను పేర్కొన్న ఫీజులు, చార్జీలనుబట్టి తెలుస్తోంది
232, 222 సీట్లు ఉండే ఏ321 విమానాల్లోనైనా.. 186, 180 సీట్లుండే ఏ320 విమానాల్లోనైనా ఈ ఛార్జీలు
వీటితో మొదటి వరుసలో విండో లేదా ఆస్లే సీటు కావాల్సిన వారు 2,000 రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని సంస్థ వెల్లడించింది
ఇప్పటి వరకు ఇది రూ.1,500 వరకు ఉన్నట్టు విమానయాన రంగ విశ్లేషకుడు అమేయ జోషి చెబుతున్నారు
ఈ ఇండిగో విమానంలో మధ్య సీటు కావాల్సిన వారు 1,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని సంస్థ పేర్కొంటోంది
ఏటీఆర్ విమానాల్లో ఈ చార్జీలు రూ.500 వరకు ఉన్నాయి. అయితే దీనిపై ప్రయాణికుల నుంచి, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నా.. సంస్థ స్పందించలేదు
విమాన ఇంధన ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గత వారం దూరాన్నిబట్టి ఆయా రూట్ల టిక్కెట్లపై రూ.1,000 వరకు సంస్థ తగ్గించిన విషయం తెలిసిందే