18 February 2024
TV9 Telugu
మీకు స్కూటర్ ఉందా..? మరి అది యమహా కంపెనీ స్కూటరేనా? అయితే మీకో అలర్ట్. యమహా ఇండియా మోటార్స్ తాజాగా సంచలన నిర్ణయం.
మన దేశంలో ఏకంగా 3 లక్షల స్కూటర్లను వెనక్కి పిలిపిస్తోంది. బ్రేక్ భాగాల్లో సమస్య తెలిత్తినట్లు గుర్తించినట్లు వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా యమహా స్కూటర్లు వాడుతున్న వారు మొత్తంగా 3 లక్షలకుపైగా స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ యమహా మోటార్స్ స్కూటర్లలో బ్రేక్ భాగాలలో సమస్యలు ఉన్నందున వాటిని సరిచేయడానికి రీకాల్ చేస్తున్నారమని యమహా కంపెనీ వెల్లడించింది.
ఈ స్కూటర్లలో బ్రేక్ భాగాలలో సమస్యలు ఉన్నందున వాటిని సరిచేయడానికి రీకాల్ చేస్తున్నారమని యమహా కంపెనీ వెల్లడించింది.
ఇండియా యమహా జనవరి 1, 2022 – జనవరి 4, 2024 మధ్య తయారు చేసిన స్కూటర్ యూనిట్లను తక్షణం అమలులోకి తీసుకువస్తున్నట్లు త తెలిపింది.
తమ వాహనాల ఉత్పత్తుల అధిక నాణ్యత, భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని యమహా మోటార్స్ కంపెనీ ప్రకటనలో తెలిపింది.
ఈ ద్విచక్ర వాహన రీకాల్ Ray ZR 125 Fi హైబ్రిడ్, Fascino 125 Fi హైబ్రిడ్ మోడల్స్ ఉన్నాయి. వాహనదారులు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.