ప్రభుత్వం కీలక నిర్ణయం..ఈ బెర్రీలపై దిగుమతి సుంకం తగ్గింపు.. ఎంతంటే

21 February 2024

TV9 Telugu

విదేశాల్లో పండించే పండ్లు బ్లూబెర్రీలు, క్రాన్‌బెర్రీలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది.

బెర్రీలపై సుంకం

బ్లూబెర్రీలు, క్రాన్‌బెర్రీలపై 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఎంత శాతం అంటే

అలాగే మాంసం, టర్కీ కోళ్ల ఫ్రొజెన్‌ మాంసం దిగుమతులపై కూడా ప్రభుత్వం సుంకాన్ని తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.

మాంసం దిగుమతులపై

ఈ మాంసం, టర్కీ కోళ్ల ఫ్రొజెన్‌ మాంసం దిగుమతులపై సుంకాన్ని 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.

దిగుమతులపై

భారత్‌-యూఎస్‌ల మధ్య ఇటీవల కుదిరిన పరస్పర అంగీకార ఒప్పదానికి లోబడి కేంద్ర వాణిజ్య శాఖ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం.

వాణిజ్య సిఫార్సు

బెర్రీలు, ఇతర వాటిపై ప్రభుత్వం వీటిపై తగ్గించిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.

తక్షణమే అమల్లోకి..

ఇటీవలి జీ20 నేతల సదస్సులో భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోగా, కొన్ని ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాల్ని తగ్గించింది.

జీ20 సదస్సులో

కాటన్‌ వస్త్రాల తయారీ పరిశ్రమ లేవనెత్తిన ఆందోళనల నేపథ్యంలో పొడుగుపింజ పత్తిపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. 

పత్తిపై దిగుమతి