తక్కువ ధరలో అధిక మైలేజ్‌ ఇచ్చే బైక్‌.. లీటర్‌కు 70 కి.మీ

17 October 2023

భారత ఆటో మొబైల్‌ రంగంలోకి ఓ కొత్త బైక్‌ విడుదలైంది. హీరో కంపెనీకి చెందిన ఈ బైక్‌ను తక్కువ బడ్జెట్‌లోనే ఏకంగా 60 నుంచి 70 కి.మీల మైలేజ్‌ చేస్తుంది.

మైలేజీ

హీరో హెచ్‌ఎఫ్‌ 100 పేరుతో మార్కెట్లోకి కొత్త బైక్‌ను విడుదలైంది.ఈ బైక్‌లో 97.2 cc ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ని అందించారు.

కొత్త బైక్‌

ఈ బైక్‌ 8000 rpm వద్ద 7.91 bhp పవర్‌ను, 6000 rpm వద్ద 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 బైక్‌ పవర్‌

ఈ బైక్‌లో 4 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు. ఇక బైక్‌ ముందు భాగంలో లిస్కోపిక్ ఫోర్కులు, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లను అందించారు. 

4 స్పీడ్‌ గేర్‌బాక్స్‌లు

ఈ బైక్‌లో డిస్క్‌ బ్రేక్‌, సెల్ఫ్‌ స్టార్ట్ ఆప్షన్‌ ఇవ్వలేదు.  ఇక ఐ3ఎస్‌ స్టాప్‌-స్టార్ట్ అనే టెక్నాలజీ ఈ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

 టెక్నాలజీ

తక్కువ ధరల్లో లభించే ఈ బైక్‌  లీటర్‌ పెట్రోల్‌తో ఏకంగా 65 నుంచి 72 కి.మీల దూరం ప్రయాణిస్తోందని కంపెనీ చెబుతోంది.

మైలేజీ

ఇక ధర విషయానికొస్తే హీరో హెచ్‌ఎఫ్‌ 100 ఢిల్లీ ఎక్స్‌ షో రూమ్‌ ధర 59,018 రూపాయలుగా ఉంది.  తక్కువ ధరల్లో లభ్యమవుతోంది.

బైక్‌ ధర

ఈ బైక్‌ నెక్సస్‌ బ్లూ, బ్లాక్‌, రెడ్‌ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరల్లో కావాల్సిన వారు మంచి మైలేజీ, బడ్జెట్‌ ధరల్లో సొంతం చేసుకోవచ్చు.

బైక్‌ కలర్స్‌