డిజిట‌ల్ చెల్లింపుల్లో ఇండియా టాప్‌.. వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్‌ 

04 March 2024

TV9 Telugu

గత 12 సంవత్సరాల్లో దేశంలో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. 

12 ఏళ్లలో

ప్రపంచవ్యాప్తంగా సాగే మొత్తం ఆన్‌లైన్ పేమెంట్స్‌లో 49 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

49 శాతం

ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డిజిటల్ చెల్లింపుల అవగాహన సదస్సులో గవర్నర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

అవగాహన సదస్సులో..

2012-13లో దేశంలో 162 కోట్ల రిటైల్ చెల్లింపులు డిజిటల్ పేమెంట్స్ అయితే, 2023-24 నాటికి 14,726 కోట్లకు పెరిగింది. 

డిజిటల్‌ చెల్లింపు

అంటే గత 12 ఏళ్లలో డిజిటల్ పేమెంట్స్ సుమారు 90 రెట్లు పెరిగాయని, ప్రపంచవ్యాప్త డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 49 శాతం భారత్‌లోనే ఉన్నాయని గవర్నర్‌ తెలిపారు.

90 రెట్లు

యూపీఐ లావాదేవీలు భారత్‌లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన పేమెంట్స్ సిస్టమ్‌గా మారిందని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు.

యూపీఐ 

దేశీయంగా డిజిటల్ చెల్లింపుల్లో గణనీయమైన వృద్ధి నమోదు చేయడంలో యూపీఐదే కీలక పాత్ర అని అన్నారు.

గణనీయమైన వృద్ధి

2017లో 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగగా, 2023 నాటికి అది 11,761 కోట్లకు పెరిగింది. రోజూ సగటున 43 కోట్ల యూపీఐ పేమెంట్స్ సాగుతున్నాయన్నారు.

యూపీ లావాదేవీలు