ఆగస్టు నెలలో భారీగా పెరిగిన యూపీఐ డిజిటల్‌ చెల్లింపులు

1 అక్టోబర్‌ 2023

ఆగస్టులో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగిన డిజిటల్‌ చెల్లింపుల సంఖ్య గతంతో పోల్చితే ఎన్నో రెట్లు పెరిగి వెయ్యి కోట్లను అధిగమించింది. 

ఆగస్టులో

ప్రధానంగా పర్సన్‌-టు-మర్చంట్‌ (పీ2ఎం) లావాదేవీల్లో పెరుగుదలే కారణమని ఓ నివేదిక పేర్కొన్నది.

లావాదేవీల నివేదికలు

2018 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 151 మిలియన్లుగా ఉంది.ఈ ఏడాది జూన్‌లో 9.3 బిలియన్లుగా నమోదైంది. 

యూపీఐ లావాదేవీలు

గత ఏడాది జనవరిలో జరిగిన మొత్తం యూపీఐ లావాదేవీల్లో పీ2ఎం లావాదేవీల వాటా 40.3 శాతంగా ఉంటే, ఈ జూన్‌లో 57.5 శాతానికి పెరిగినట్టు వరల్డ్‌లైన్‌ తెలిపింది. 

గత ఏడాదిలో..

యూపీఐ ద్వారా జరుగుతున్న పీ2ఎం లావాదేవీల్లో సగటు లావాదేవీ విలువ తగ్గింది. గత ఏడాది జనవరిలో ఒక్కో లావాదేవీ సగటున రూ.885గా ఉన్నట్టు తేలింది.

లావాదేవీ విలువ

ఈ జూన్‌లో రూ.653గానే ఉంది. దీంతో యూపీఐ ఆధారంగా వ్యాపారులకు వ్యక్తులు ఎక్కువగా చిన్నచిన్న లావాదేవీలనే జరుపుతున్నారని రుజువైందంటూ వరల్డ్‌లైన్‌ తెలిపింది. 

 జూన్‌ నెలలో

ఇక ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఈటీసీ)కు సంబంధించి కూడా లావాదేవీలు పెరిగినట్టు నివేదికలో స్పష్టమైంది.

ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌

గత ఏడాది జనవరితో చూస్తే ఈ ఏడాది జూన్‌లో లావాదేవీలు 56.5 శాతం ఎగిసి 45.97 మిలియన్ల నుంచి 71.92 మిలియన్లకు చేరుకున్నాయి.

గత ఏడాది జనవరితో..