ఈ పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం

TV9 Telugu

20 March 2024

పెట్టుబడికి భద్రత.. స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకువారు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.

డిపాజిట్‌ చేసిన సొమ్ముకు మార్కెట్‌తో సంబంధం ఉండదు. స్థిరమైన ఆదాయం అందించే పథకంగా మంచి ప్రజాదరణ పొందింది.

క‌నీసం 1,000 రూపాయలు నుంచి సింగిల్‌ ఖాతాలో గ‌రిష్ఠంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో గరిష్ఠంగా రూ.15 లక్షలు డిపాజిట్‌ చేయొచ్చు.

మెచ్యూరిటీ పూర్తయ్యేవరకు ప్రతి నెలా 7.4 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది.

ఐదేళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుంది. ముందస్తు ఉపసంహరణకు వడ్డీపై కొంత శాతాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు.

మీకు నెలవారీ 5,550 రూపాయల ఆదాయానికి 9 లక్షలు డిపాజిట్‌ చేయాలి. జాయింట్‌ ఖాతా తెరిచి 15 లక్షల డిపాజిట్‌ చేస్తే నెలకు 9,250 రూపాయలు వస్తుంది.

సీనియర్‌ సిటిజన్లు ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం కచ్చితమైన ఆదాయం పొందాలనుకుంటే ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. మీ దగ్గరలో ఉన్న పోస్టు ఆఫీసులో ఇది పొందవచ్చు.