ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఈ తప్పులు చేశారంటే మీ డబ్బులు పనికిరాకుండా..

21 September 2023

కష్టపడి డబ్బు సంపాదిస్తాం. దానిని సరిగ్గా వినియోగించుకోవడం కోసం ప్లాన్ అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాం.

అయితే, ఇక్కడ ఒక్కోసారి తప్పులు చేస్తాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతారు. అవేమిటో చూద్దాం.

మన దగ్గర ఉన్న మొత్తం డబ్బును అపార్ట్మెంట్స్ లేదా ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేయకూడదు.  ఎక్కువుగా రిటర్న్స్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చెయ్యాలి.

బంగారం కొనడం కొందరికి ఫాషన్. బంగారం కొనేయాల్ని తహతహ లాడుతారు. అవసరం లేకపోయినా డబ్బుందని కొని ప్తెట్టేస్తుంటారు. అలా చేయకూడదు.

ఫిక్స్ డ్ డిపాజిట్లలోనే మంచి లాభం వస్తుందని కేవలం వాటినే నమ్ముతారు కొందరు. వాటి వల్ల కొన్నిసార్లు నష్టం కూడా వస్తుంది.

అది మంచిది కాదు. పెట్టుబడులలో వైవిధ్యం ఉండాలి. సరైన పద్దతిలో ఏదైతే మంచి వస్తున్నాయో వాటిలో ఇన్వెస్ట్ మీ సంపద పెడుతుంది.

టాక్స్ సేవింగ్స్ కోసం అని ఆర్ధిక సంవత్సరం చివరిలో హడావుడిగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తూ ఉంటారు. ఆలా చేయవద్దు.

రిటైర్మెంట్ తరువాత జీవితానికి ఈపీఎఫ్ ఫండ్స్ సరిపోతాయని భావిస్తారు. కానీ, రిటైర్మెంట్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాలి.