పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉంటే లక్షల కోట్ల సంపద ఉన్నట్లే..!
02 October 2023
పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ-వేస్ట్‌గా భావిస్తున్నారా? అయితే, ఇటీవల జరిపిన అధ్యయనంలో అవి దేశంలోని గొప్ప సంపద అని తేలింది.
ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్, ప్రముఖ ఐటీ దిగ్గజం సంస్థ యాక్సెంచర్ సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి.
దాదాపు 206 మిలియన్లు, అంటే 20 కోట్ల 60 లక్షల పాడైపోయిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు భారతీయుల ఇళ్లలో పడి ఉన్నాయని తేలింది.
ఇలాంటి వ్యర్థాలే ఎలక్ట్రానిక్ రీ సైక్లింగ్ బిజినెస్‌కి ఆధారం. 2035 నాటికి ఈ రీసైక్లింగ్ బిజినెస్ దాదాపు రూ. లక్ష 66 వేల కోట్లకుచేరే అవకాశం ఉంది.
ఈ-వేస్ట్ రిఫర్బిషింగ్, రిపేర్ అండ్ రీసేల్ సహా ఆరురకాల ఎలక్ట్రానిక్స్ రీసైక్లింగ్ బిజినెస్ 2035 నాటికి దాదాపు రూ.58 వేల కోట్ల ఆదాయం ఆర్జించవచ్చంటోంది నివేదిక.
ప్రభుత్వ, ప్రైవేట్ సహకారంతో ఈ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తే 20 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అధ్యయనంలో వెల్లడైంది.
భవిష్యత్తులో రీసైక్లింగ్, ఈ వేస్ట్ రీ సెల్లింగ్ బిజినెస్‌లో భారత్ ముందంజలో ఉంటుంది. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న, అతిపెద్ద రంగంగా ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్ రంగం అవతరించనుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, ఈ రంగంలో దాదాపు 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.