డెబిట్ కార్డులు ఇక చరిత్రగా మిగిలిపోతాయా? 

18 October 2023

డెబిట్ కార్డులకు కాలం చెల్లిపోతుందా అనే అనుమానం మీకు వస్తే రాబోయే రోజుల్లో అదే నిజం కావచ్చు అనే సమాధానం వస్తుంది. తాజా లెక్కలు అదే చెబుతున్నాయి 

కోవిడ్  వెళ్ళిపోయింది.. కానీ ప్రజలు డెబిట్ కార్డ్‌ల ద్వారా UPI - ఇతర కాంటాక్ట్‌లెస్ పేమెంట్ పద్ధతులను ఉపయోగించడం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు UPI లేకుండా జీవితం అసాధ్యం అని అనిపిస్తుంది.

RBI - NPCI డేటా ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో డెబిట్ కార్డుల ద్వారా మొత్తం 7.2 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. యూపీఐ ద్వారా 1 కోటి 39 లక్షలు, 20 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. 

ఇందులో  కస్టమర్‌కు ప్రయోజనం ఏమిటంటే, వారు ఒకేసారి ఎక్కువ డబ్బు పెట్టనవసరం లేకుండా ఖరీదైన వస్తువులను వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ లేదా NBFCకి ప్రయోజనం ఏమిటంటే, వారి బిజినెస్ డెవలప్ అవుతుంది. 

2022 ప్రథమార్థంలో, UPI ద్వారా 32 బిలియన్ల లావాదేవీలు జరగగా.. ఈ ఏడాది ఇదే కాలంలో 52 బిలియన్ల లావాదేవీలకు పెరిగింది. అలాగే  UPI లావాదేవీల విలువ కూడా 47% పెరిగి 83,17,000 కోట్ల రూపాయలకు చేరుకుంది.

దీనికి విరుద్ధంగా డెబిట్ కార్డ్‌లు ఈ కాలంలో లావాదేవీల సంఖ్యలో 28% తగ్గాయి.  ఇది దాదాపు 1.38 బిలియన్లు. లావాదేవీ విలువ 14.8% తగ్గి 3,17,000 కోట్ల రూపాయలకు చేరుకుంది.

డెబిట్ కార్డ్‌లను తక్కువగా ఉపయోగించడం అనేది  UPI ప్రజలకు ఇష్టమైనదిగా మారిందని సూచిస్తుంది.  డెబిట్ కార్డుల ద్వారా ఖర్చు చేసే ప్రతి 100 రూపాయలకు  UPI ద్వారా 1,900 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు 

2026-27 నాటికి దేశంలో UPI ద్వారా ప్రతిరోజూ 1 బిలియన్ లావాదేవీలు జరుగుతాయి. మొత్తం డిజిటల్ లావాదేవీలలో UPI వాటా 2026-27 నాటికి 90%కి పెరుగుతుందని చాలా రిపోర్టులు చెబుతున్నాయి.