ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు పెరుగుతున్నాయి..తాజాగా ఈ లిస్టులో ICICI
18 October 2023
ఈ మధ్యకాలంలో బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు బాగా పెరుగుతూ వస్తున్నాయి. బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడం కోసం ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచింది
ఇప్పుడు ICICI బ్యాంక్‌లో FD చేస్తే, సాధారణ ప్రజలకు 7.10% వరకు వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్‌లకు 7.65% వరకు వడ్డీ లభిస్తుంది. 2 కోట్ల లోపు ఎఫ్‌డిలపై బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది.
ఇప్పుడు ICICI బ్యాంక్‌లో FD చేయడంపై, సాధారణ పౌరులు 3.00% నుంచి 7.10% వరకు వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే 3.50% నుంచి 7.65% వరకు వడ్డీ లభిస్తుంది.
అంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను మార్చాయి. 2 కోట్ల కంటే తక్కువ FD వడ్డీ రేట్లలో ఈ మార్పు చేశారు.
ఇప్పుడు సాధారణ పౌరులు HDFC బ్యాంక్‌లో FD చేయడంపై 3% నుంచి 7.20% వరకు వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్లకు 3.50% నుంచి 7.75% వరకు వడ్డీ లభిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు సాధారణ పౌరులకు FDపై 3.00 నుంచి 7.25% వరకు వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు FDపై 3.50 నుంచి 7.75% వడ్డీని అందిస్తోంది.
మరిన్ని బ్యాంకులు కూడా ఇదే మార్గంలో నడవవచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులు FD లపై వడ్డీ రేట్లు పెంచడం ఇన్వెస్టర్స్ కి సురక్షితమైన పెట్టుబడితో పాటు మంచి రాబడి కూడా దొరుకుతుంది.
పండుగ సీజన్ కావడం.. ద్రవ్యల్బణం అదుపులో ఉండడటం.. లోన్స్ కోసం ప్రజల నుంచి ఒత్తిడి పెరగడం.. ఇలాంటి కారణాల వల్ల బ్యాంకులు FD లపై వడ్డీ రేట్లు పెంచుతూ వస్తున్నాయి.