10 August 2024
Subhash
దేశ రైతుల కోసం పీఎం మోడీ పీఎం కిసాన్ స్కీమ్‌లో ఏడాదికి రూ.6000 అందుకుంటున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2000 చొప్పున వారి ఖాతాల్లో జమ అవుతుంది.
ఈ పీఎం కిసాన్ పథకంలో ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం చాలా సులభం. పీఎం కిసాన్ పోర్టల్లో ఫోన్ నంబర్ అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం.
పీఎం కిసాన్ పోర్టల్ ను సందర్శించండి. హెూమ్ పేజీలో, మీరు ఫార్మర్ కార్నర్ లోకి వెళ్లి ‘అప్డేట్ మొబైల్ నంబర్’ ఆప్షన్ సెలెక్ట్ చేసి క్లిక్ చేయాలి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆపై క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి.
కింద కనిపించే బాక్స్‌లో టిక్ చేసి గెట్ ఆధార్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మీ ఆధార్-లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ నమోదు చేసి ధృవీకరించండి.
రిజిస్ట్రేషన్ నంబర్, మీ పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, జెండర్ వివరాలతో కూడిన పూర్తి సమాచారం మీకు అందుతుంది.
ఇప్పుడు, దిగువన ఉన్న బాక్స్‌లో కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి.
మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ధ్రువీకరించండి. అంతే మీ కొత్త నంబర్ అప్‌డేట అయిపోతుంది.