మీ చిన్నారులకు ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్పండి ఇలా..

13 September 2023

ఫైనాన్షియల్ ఫ్రీడం.. ఫైనాన్షియల్ ప్లాన్ ఇవి రెండూ చక్కని జీవితానికి చాలా కీలకమైనవి. భవిష్యత్ అవసరాల కోసం కొంత డబ్బు దాచుకోవడం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు.

చిన్నతనం నుంచి సేవింగ్స్ కి సంబంధించిన ప్లానింగ్ ఎలా ఉండాలి అనేది నేర్పాల్సిందే. ఇలా చేయడం చాల మంచిది.

ఖర్చు పెట్టడం సులువు.. దాచుకోవడం కష్టం.. కష్టపడి దాచుకున్నది భవిష్యత్ లో ఎంతో మేలు చేస్తుంది అనే విషయాన్ని పిల్లలకు అర్ధం అయ్యేలా చెప్పాలి.

ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవడం... కోరికలకు... అవసరాలకు మధ్య తేడాను అర్ధం చేసుకునేలా చేయడం చాలా ముఖ్యం.

పిల్లలకు డబ్బు విలువ నేర్పడానికి చాలా ఓర్పు కావాలి. మొదట వారికి ఇంట్లో డబ్బు ఎలా వస్తుంది? ఎలా ఖర్చు అవుతుంది అనే అవగాహన కల్పించాలి.

తరువాత వారిని బ్యాంకు తీసుకువెళ్ళడం.. వారితో ఒక సేవింగ్స్ ఎకౌంట్ ఓపెన్ చేయించడం. దానిని ఆపరేట్ చేసేలా ప్రోత్సహించడం చేయవచ్చు.

పిల్లల్ని ఇంటి నెలవారీ బడ్జెట్ విషయాల్లో ఇన్వాల్వ్ చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.పెద్ద అయిన తరువాత వారికి సేవింగ్స్ గురించి ఇన్వెస్ట్మెంట్స్ గురించి తరచూ వివరిస్తూ ఉండాలి.

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన పుస్తకాలు చదివేలా వీడియోలు చూసేలా ప్రోత్సహిస్తే వారు డబ్బు విలువ తెలుసుకుని భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని సాఫీగా గడపగలుగుతారు.