ఇన్సూరెన్స్ పాలసీ సరెండర్ చేయాలంటే ఎలా?

27 September 2023

ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు వచ్చినపుడు ఇన్సూరెన్స్ పాలసీని మెచ్యూరిటీకి ముందు సరెండర్ చేయాలి అనుకోవడం సహజం. ఇలా మెచ్యూరిటీకి ముందు ఇన్సూరెన్స్ పాలసీ బ్రేక్ చేస్తే ఏమి జరుగుతుంది.

బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ నిబంధనల ప్రకారం మెచ్యూరిటీకి ముందే పాలసీని సరెండర్ చేయవచ్చు. ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ టైం కంటే ముందే క్లోజ్ చేస్తే దానిని సరెండర్ గా చెబుతారు.

పాలసీని సరెండర్ చేసినప్పుడు, పాలసీదారు చెల్లించిన ప్రీమియంలో కొంత భాగాన్ని పొందుతారు, దీనిని సరెండర్ వాల్యూ అంటారు.

ఇన్సూరెన్స్ పాలసీని ముందస్తుగా క్లోజ్ చేస్తే , పాలసీదారు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. పాలసీని సరెండర్ చేయడానికి కంపెనీలు రెండు ఆప్షన్‌లు ఇస్తాయి.

మొదటిది గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ. ఇందులో పాలసీదారు 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే తన పాలసీని సరెండర్ చేయవచ్చు.

రెండోది పాలసీదారుకు ప్రత్యేక సరెండర్ వాల్యూ లభిస్తుంది. దీనిని బేసిక్ సమ్ అష్యూర్డ్, టోటల్ బోనస్ అలాగే సరెండర్ వాల్యూ ఆధారంగా నిర్ణయిస్తారు.

గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ కంటే ఎక్కువ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. దీంతో పాటు బోనస్ కూడా అందుకోవచ్చు. పాలసీని సరెండర్ చేయాల్సి వస్తే, మూడేళ్ల తర్వాత మాత్రమే పాలసీ తిరిగి ఇవ్వాలి.

ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో మొదటి మూడు సంవత్సరాలు ఏజెంట్ కమీషన్ - డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఇన్సెంటివ్, బోనస్ మొదలైన వాటికి ఎక్కువ ఖర్చు అయిపోతుంది.