కారు ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోండి ఇలా..

04 October 2023

కారు ఇన్సూరెన్స్ ఉంది కదా అని చిన్న చిన్న రిపేర్ల కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి వెళ్ళకండి. మీరు సంవత్సరంలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయకపోతే కనుక మీకు నో క్లెయిమ్ బోనస్ (NCB)వస్తుంది.

దీనివలన రెన్యువల్ సమయంలో దాదాపు 20% వరకూ ప్రీమియం తగ్గుతుంది. చిన్న చిన్న మరమ్మతుల కోసం అంటే డెంట్ రిపేర్, టెయిల్ లైట్ విరిగిపోవడం వంటివి కంపెనీ సర్వీస్ సెంటర్ కు బదులుగా మంచి మెకానిక్ దగ్గర చేయించండి.

మీరు కొన్ని సంవత్సరాల పాటు కనుక ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే మీకు ప్రీమియంలో 50% నుంచి 60 శాతం వరకూ డిస్కౌంట్ వచ్చే అవకాశము ఉంటుంది.

కారులో యాంటీ థెఫ్ట్ గాడ్జెట్ ఇన్ స్టాల్ చేయండి. ఇటువంటిది ఉండడం వలన మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం లో 5% తగ్గుదల ఉంటుంది.

కారులో సేఫ్టీ పరికరాలను అంటే ఫైర్ రెసిస్టెన్స్ ఉంచడం వలన ఇన్సూరెన్స్ కంపెనీలు మంచి డిస్కౌంట్స్ ఇస్తాయి.

ఇక మీ కారులో ఖరీదైన ఫ్యాన్సీ గాడ్జెట్స్ పెట్టుకోకండి. అంటే మీరు అల్ట్రాసోనిక్ సెన్సార్‌లు, ఆటోమోటివ్ నైట్ విజన్ మొదలైన ఖరీదైన గాడ్జెట్‌లను కారులో పెట్టుకుంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది.

ఎటువంటి పరిస్థితిలోనూ పాలసీ లాప్స్ కాకుండా చూసుకోండి. ఎప్పుడైనా ఒక్క రోజు ఆలస్యంగా ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చేసినా మీకు నో క్లెయిమ్ బోనస్ రాదు.

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు వివిధ కంపెనీలు ఇస్తున్న పాలసీల ధరలను పోల్చి చూసుకోండి. దానివలన మీరు తక్కువ ఖర్చు అయ్యే కంపెనీ నుంచి పాలసీ తీసుకోవచ్చు. డబ్బు ఆదా చేసుకోవచ్చు.

సురక్షితంగా డ్రైవ్ చేయండి.. అతి వేగం వద్దు.. మద్యం తాగి కారు నడపవద్దు.. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పరిస్థితే రాదు కదా. అందుకే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.