30 September 2023

క్లెయిమ్ చేయని డిపాజిట్లను తెలుసుకోవడం ఎలా..?

మన దేశంలోని ఏదైనా బ్యాంకులో గతంలో ఎప్పుడో డబ్బులు డిపాజిట్ చేసి ఉండవచ్చు. ఆ తరువాత దాని విషయం మర్చిపోయి ఉండవచ్చు. 

తరువాత అది గుర్తుకువచ్చినా.. ఎక్కడో చేసిన డిపాజిట్.. ఇప్పుడు అక్కడికి వెళ్లి తిరిగి అది వెనక్కి తెచ్చుకోవడం ఎలానో తెలియదు. 

ఇలాంటి వారి కోసం ఓ  గుడ్ న్యూస్ ఉంది. సంవత్సరాలుగా ఎక్కడో బ్యాంకులో చిక్కుకుపోయిన మీ డబ్బును క్లయిం చేసుకునే అవకాశం వచ్చింది. 

సాధారణంగా ఒక కస్టమర్ లేదా థర్డ్ పార్టీ రెండు సంవత్సరాల పాటు సేవింగ్స్ లేదా కరెంట్ ఎకౌంట్ నుంచి ఎలాంటి లావాదేవీలు చేయకపోతే  ఆ ఎకౌంట్ పనిచేయదు 

లేదా పాసివ్ గా మారుతుంది. అంటే మీరు ఆ ఖాతా నుంచి డబ్బుకోసం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేరు.

అదే విధంగా, మెచ్యూరిటీ అయిన 2 సంవత్సరాలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ క్లెయిమ్ చేయకపోతే, అది కూడా పనికిరాకుండా పోతుంది లేదా పాసివ్ అవుతుంది. 

ఈఎకౌంట్స్  10 సంవత్సరాల పాటు పనిచేయకుండా ఉండిపోయిన  తర్వాత, బ్యాలెన్స్ రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEAF)కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 

రిజర్వ్ బ్యాంక్ ఇటీవల UDGAM అనే పోర్టల్‌ను ప్రారంభించింది. మీరు బ్యాంక్ ఎకౌంట్స్ లో ఉంచిన.. క్లెయిమ్ చేయని మొత్తాల గురించిన సమాచారాన్నిఇక్కడ  పొందవచ్చు. 

దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో క్లెయిమ్‌దారులు లేకుండా 35 వేల కోట్ల రూపాయలకు పైగా పడి అలా ఉంది. 

ఈ డబ్బు రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEAF)లో ఉంది. ఈ ఫండ్‌కు సంవత్సరానికి 3 శాతం చొప్పున సాధారణ వడ్డీ కూడా యాడ్ అవుతూ వస్తోంది. 

దేశంలోని 7 బ్యాంకులలో ఉన్న  క్లెయిమ్ చేయని డిపాజిట్లతో రిజర్వ్ బ్యాంక్ ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. 

ప్రారంభంలో, ఈ పోర్టల్ ద్వారా, కొన్ని బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్‌ల గురించిన సమాచారాన్ని పొందవచ్చు. 

అవి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, DBS బ్యాంక్, హమాచి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ బ్యాంక్ - సౌత్ ఇండియన్ బ్యాంక్. అక్టోబర్ 15 నుంచి అన్ని ఇతర బ్యాంకులు కూడా ఈ పోర్టల్‌లో చేరుతాయి.