మీ వద్ద 2 వేల నోట్లు ఇంకా ఉన్నాయా? వాటిని ఇలా డిపాజిట్ చేయండి.
ఆర్‌బీఐ రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఇన్‌సూర్డ్ పోస్టు లేదా టీఎల్ఆర్ చేయాలని సూచించింది.
ఒకవేళ మీ దగ్గర 2వేల నోట్లు ఉంటే ఇన్‌సూర్డ్ పోస్టు ద్వారా ఆ నోట్లను ఆర్బీఐకి పంపుకునే అవకాశాన్ని కల్పించారు.
బ్యాంక్ అకౌంట్లోకి ఆ 2 వేల నోట్ల అమౌంట్ క్రెడిట్ అవుతుందని ఆర్బీఐ అధికారులు చెప్పారు.
ప్రాంతీయ ఆఫీసులకు దూరంగా ఉన్న ప్రజలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
ఇన్‌స్యూర్డ్ పోస్టుతో పాటు టీఎల్ఆర్ పద్ధతిలోనూ రెండు వేల నోట్లను ఎక్స్‌చేంజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
టీఎల్ఆర్ అంటే ట్రిపుల్ లాక్ రిసెప్టకల్. టీఎల్ఆర్ దరఖాస్తును నింపి ఆర్బీఐకి పంపిస్తే, అప్పుడు ఆ కస్టమర్ బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్ డిపాజిట్ అవుతుంది.
టీఎల్ఆర్, ఇన్‌సూర్డ్ పోస్టు విధానాలు చాలా భద్రమైనవని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఆర్బీఐ ఆఫీసుకు ఇప్పటి వరకు 700 టీఎల్ఆర్ ఫార్మ్స్ వచ్చినట్లు చెప్పారు.